
నిర్వహణ భారమై మూతపడ్తున్న ప్రైవేటు ఇంటర్ కాలేజీలు
ఈ ఏడాది 123 జూనియర్ కాలేజీలు మూత
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ కాలేజీల దెబ్బకు బడ్జెట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మూతపడుతున్నాయి. ఆరేండ్లలో 630 కాలేజీలు క్లోజ్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అడ్మిషన్లు రాక, నిర్వహణ కష్టమైపోవడంతో మేనేజ్మెంట్లు కాలేజీలు మూసేస్తున్నాయి. మరోవైపు కొత్త కాలేజీలకు పర్మిషన్లు రాకపోవడంతో, పాత కాలేజీలను కార్పొరేట్ కాలేజీలు కొని, నిబంధనలకు విరుద్ధంగా సిటీల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి.
ఈసారి 1,540 కాలేజీలే..
స్టేట్‌లో ఈసారి 1,540 కాలేజీలు మాత్రమే అఫిలియేషన్కోసం ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకున్నాయి. ఇప్పటివరకు1,466 కాలేజీలకే పర్మిషన్ ఇవ్వగా, మరో 74 కాలేజీల అఫిలియేషన్ ప్రాసెస్‌లో ఉంది. అయితే ఈసారి123 కాలేజీలు మూతపడ్డాయి. ఏటా ఫీజు కట్టీ అఫిలియేషన్‌కు అప్లై చేసుకునే కాలేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇందుకు అడ్మిషన్లు రాకపోవడం, సరైన వసతులు లేక మేనేజ్మెంట్లే మూసివేసుకోవడం కారణంగా తెలుస్తోంది. అయితే స్టేట్ లో విస్తరిస్తున్న కార్పొరేట్ కాలేజీల ప్రభావం చిన్న కాలేజీలపై తీవ్రంగా పడుతోంది. అలాగే ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీల్లో ఇంటర్ అప్ గ్రేడేషన్‌కు భారీగా అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గి, నిర్వహణ భారమవుతోంది. చివరకు కాలేజీలు మూసివేయక తప్పడంలేదని మేనేజ్మెంట్లు చెబుతున్నాయి.
For More News..