సీఎం ఎదుట లొంగిపోయిన 644 మంది మిలిటెంట్లు

ఎవరూ ఊహించనంతగా..భారీ సంఖ్యలో మిలిటెంట్లు లొంగి పోయారు. మరి కొద్ది నెలల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఏకంగా 644 మంది మిలిటెంట్లు లొంగిపోయారు. రాష్ట్రానికి సంబంధించి ఇదొక అద్భుతమైన రోజు అన్నారు రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత అన్నారు. రాష్ట్రంలో టెర్రరిస్టు కార్యకలాపాలు పెరగడం… త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతమంది మిలిటెంట్లు లొంగిపోవడం సాధారణ విషయం కాదన్నారు.

లొంగిపోయిన వారు 8 మిలిటెంట్స్ గ్రూపులకు చెందినవారని డీజీపీ మహంత తెలిపారు. ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. సీఎం సమక్షంలో లొంగిపోయిన సమయంలో వారు తమ దగ్గర ఉన్న ఏకే-47, ఏకే-56 ఆయుధాలతో పాటు బాంబులు, పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అందించారని తెలిపారు. వీరందరికీ పునరావాసం కల్పించనున్న సీఎం సర్బానంద తెలిపారు.

Latest Updates