నోకియా నుంచి 65 ఇంచుల టీవీ: ధ‌ర ఎంతో తెలుసా..!

నోకియా కంపెనీ ఇండియా మార్కెట్లోకి 65 ఇంచుల 4కే రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ ‌టీవీని లాంఛ్‌ చేసింది. ఇప్పటికే ఈ సంస్థ ఇండియా మార్కెట్లో 55, 43 ఇంచుల రెండు టీవీలు అమ్ముతోంది. ఇవన్నీ అండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. కొత్త టీవీలో క్వాలిటీ మ్యూజిక్ కోసం డాల్బీ విజన్ టెక్నాలజీ కలిగిన జేబీఎల్ స్పీకర్లు అమర్చారు.

హెచ్‌డీఆర్ సపోర్ట్, 480 నిట్స్ బ్రైట్నెస్, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, వై–ఫై, క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ, బ్లూ టూత్ వంటివి ఈ టీవీలోని అదనపు ఫీచర్లు. ధర 64,999 రూపాయలు. ఈ నెల ఆరో తేదీ నుంచి ఫ్లిప్‌‌కార్ట్‌లో ఆర్డర్ చేయొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates