చనిపోయినా మరో ఐదుగురికి ప్రాణం పోసింది

జీవితంలో అవయవధానం ఎంతో గొప్పది మన ప్రాణాలు పోయినా చావు బతుకుల్లో ఉన్న వారికి ప్రాణం పోసే గొప్ప అవకాశం. అది అవయవధానంతోనే సాధ్యం. సేవాగుణం గల వారెవరైనా ఈ అవకాశాన్ని వదులుకోరు అందుకే పంజాగుట్టలో బోయినిపల్లి రుద్రమదేవి( 65) తాను చనియి మరో ఐదుగురికి ప్రాణం పోసింది. అవయవాలు ధానం చేసి మరో ఐదుగురికి జీవితాన్ని ఇచ్చింది. ఈ నెల 9న అనారోగ్యానికి గురైన రుద్రమదేవిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ నుంచి సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించారు. కానీ ఈ నెల 11న రుద్రమదేవి మృతి చెందింది. దీంతో జీవన్ దాన్ ప్రతినిధులు రుద్రమదేవి కుటుంబాన్ని కలిసి అవయవధానం గురించి వివరించారు. రుద్రమదేవి అవయవాలను ధానం చేయడానికి వారు అంగీకరించారు. దీంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న కొందరికి  రుద్రమదేవి మూత్రపిండాలు, కాళేయం, కళ్లు ధానం చేశారు.

see more news

పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకు మృతి

చిన్నపిల్లలు కేన్సర్ బారినపడడం బాధాకరం

Latest Updates