ఫేక్‌‌‌‌ ఇన్వాయిస్‌‌‌‌లతో 67.7 కోట్ల జీఎస్టీ ఎగవేత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫేక్‌‌‌‌ ఇన్వాయిస్‌‌‌‌లు క్రియేట్‌‌‌‌ చేసి, జీఎస్టీ ఎగవేసిన కేసులో సెంట్రల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌ అధికారులు ముగ్గురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. గోర్ధాన్ సింగ్‌‌‌‌, అర్జున్‌‌‌‌ చౌదరి, కిరణ్ చౌదరి అనే వ్యక్తులు ఎలాంటి గూడ్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేయకుండానే 200 కంపెనీల పేర్లతో ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ పొందారని, దాని విలువ సుమారు 67.76 కోట్లు ఉంటుందని బుధవారం రిలీజ్‌‌‌‌ చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ ముగ్గురికీ వికాస్‌‌‌‌ సరఫ్‌‌‌‌ అనే ఆడిటర్ హెల్ప్‌‌‌‌ చేశాడని చెప్పారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్స్‌‌‌‌, బోగస్‌‌‌‌ కంపెనీలతో ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ బిల్స్‌‌‌‌ ఏర్పాటు చేయడం, అకౌంట్స్‌‌‌‌, ఐటీ, జీఎస్టీ ఫైలింగ్స్‌‌ను వికాస్‌‌‌‌ మెయింటెయిన్‌‌‌‌ చేస్తున్నారన్నారు. ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో నిందితులు తప్పు ఒప్పుకున్నారని, వారిని అరెస్ట్‌‌‌‌ చేసి, రిమాండ్‌‌‌‌కు తరలించామని పోలీసులు చెప్పారు. గోర్ధాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ పరారీలో ఉన్నాడని, విచారణ కొనసాగుతుందని తెలిపారు.

For More News..

వరంగల్‌‌‌‌‌కు రూ.162 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఫోర్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌ జాబ్స్ రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!

హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌లో అడ్డా వేసిన భూమా ఫ్యామిలీ

Latest Updates