దేశంలో 73 లక్షలు దాటిన కేసులు..64 లక్షలకు చేరువైన రికవరీ

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,708 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 73 లక్షలకు చేరాయి. ప్రస్తుతానికి దేశంలో మొత్తం 73,07,098 కరోనా కేసులున్నాయి. నిన్న 680 మంది చనిపోవడంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య మొత్తం 1,11,266 కు చేరింది. నిన్న ఒక్కరోజే 81541 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నిన్నటి వరకు 63,83,442 మంది డిశ్చార్జ్ అయ్యారు.  మరో 8,12,390 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసులు 11.12 శాతం, రికవరీ 87.36 శాతం, డెత్ రేటు 1.52 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

Latest Updates