ముగిసిన ఆరో విడత పోలింగ్

6th phase loksabha elections completed

దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఐదు గంటలకే పోలింగ్‌ ముగిసినప్పటికీ అప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని చోట్లా పోలింగ్‌ ముగిసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు 59.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. బిహార్‌లో 55.04 శాతం, హరియాణాలో 62.14 శాతం, మధ్యప్రదేశ్‌లో 60.12 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 50.82 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 80.13శాతం, ఝార్ఖండ్‌లో 64.46 శాతం, దిల్లీలో 55.44శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మొత్తం 7 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. బిహార్‌లోని 8, దిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

Latest Updates