7వరోజు లారీల సమ్మె : భోరజ్ హైవేపై లారీలతో రాస్తారోకో

దేశవ్యాప్తంగా 7వరోజు లారీల సమ్మె కొనసాగుతుంది. డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు లారీ ఓనర్లు. సమ్మెతో దేశంలోని 90 లక్షల లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు సమ్మెతో రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. భోరజ్ హైవేపై లారీలతో భారీగా రాస్తారోకో నిర్వహించారు లారీ ఓనర్లు. దీంతో జాతీయరహదారిపై 5 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏడు రోజులుగా లారీలు ఎక్కడికక్కడే నిలిచినా కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడం భాధాకరమన్నారు లారీ ఓనర్లు. కేంద్రం దిగివచ్చేవరకూ తామ స్ట్రైక్ కొనసాగుతుందని లారీ ఓనర్లు తెలిపారు. లారీల స్ట్రైక్ మరో రెండులపాటు కొనసాగితే టెక్స్ టైల్ ఎక్స్ పోర్టర్స్  పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఇండియన్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ సమాఖ్య చైర్మన్ ఎస్ కే జైన్ తెలిపారు. సమ్మె కారణంగా సిటీలకు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల సప్లయి పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులకు గురౌతున్నారు.

Posted in Uncategorized

Latest Updates