7 దేశాలు, 50 రోజులు : బైకులపై తెలంగాణ అమ్మాయిల సాహసయాత్ర

girlsఏడు దేశాలు.. 50 రోజులు… వేల కిలోమీటర్లు. బైకులపై సాహసయాత్రకు బయల్దేరనున్నారు నలుగురు యువతులు. జయభారతి, శిల్ప, ప్రియ, శాంతి అనే నలుగురు అమ్మాయిలు.. అడ్వెంచర్ టూర్ కు రెడీ అయ్యారు. ఈ సాహసయాత్ర ఆదివారం (ఫిబ్రవరి-11) హైదరాబాద్ నుంచి ప్రారంభంకానుంది.

తెలంగాణకు చెందిన నలుగురు అమ్మాయిలు ఈ బైక్ రైడ్ లో పాల్గొనడం అభినందించతగ్గ విషయమన్నారు మంత్రి చందులాల్. వాళ్లకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామన్న చందూలాల్..టూరిజం డిపార్ట్ మెంట్ నుంచి వాళ్ల యాత్రకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. బైకులు, లైఫ్ జాకెట్లు, అందజేశామని తెలిపిన ఆయన.. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాకారాలు అందిస్తామన్నారు. . బంగ్లాదేశ్, కాంబోడియా, ఫిలిప్పిన్స్ మీదుగా ఏడు దేశాల గుండా సాగే యాత్ర.. రాష్ట్రానికి చేరాక ముగుస్తుంది.

Posted in Uncategorized

Latest Updates