బ్యాటరీ కారు నడుపుతూ.. కోమటిచెరువు పనులను పరిశీలించిన హరీష్

HARISH DRIVEతెలంగాణ మంత్రి హరీష రావు 7 సీటర్ బ్యాటరీ కారు నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. సిద్దిపేట  జిల్లా కేంద్రంలోని కోమటిచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మినీ ట్యాంక్‌ బండ్‌పై 7 సీటర్ బ్యాటరీ కారును మంత్రి హరీష్ శుక్రవారం (జూలై-6) ఉదయం ప్రారంభించారు.

బ్యాటరీ కారును స్వయంగా మంత్రే డ్రైవ్ చేస్తూ ట్యాంక్ బండ్ చుట్టూ చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా కోమటి చెరువు సుందరీకరణ పనులపై అధికారులు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో మంత్రి హరీశ్ సమీక్ష నిర్వహించారు. మినీ ట్యాంక్‌ బండ్ సుందీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని టూరిజం, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి వెంట సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates