శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే

శీతాకాలం .. ఆపై కరోనా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవాలి. తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు మనదరి చేరవు.  అయితే ఇప్పుడు మనం శీతాకాలంలో విరివిరిగా దొరికే ఎలాంటి పండ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో తెలుసుకుందాం. వాటిలో

జామకాయ ‌‌– శీతాకాలం సీజన్ లో జామకాయలు తినేందుకు ప్రతీ ఒక్కరు తింటారు. వీటిని తినడం వల్ల ఆందంతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. ప్రమాదకరమైన వైరస్ లతో పోరాడే గుణం ఉంది. ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు గుండె మరియు రక్తంలో షుగర్ స్థాయిల్ని నిలువరిస్తుంది.

ఆరెంజ్  ‌– ఆరెంజ్  సిట్రస్ పండ్లు. అంటే నోటికి పుల్లగా అనిపించే పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు. మీకు ఇష్టం అయితే ఆరెంజ్ ను జ్యూస్ గా చేసుకొని తాగొచ్చు.

ఆపిల్ – శరీరంలో వేడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని స్ట్రాంగ్ గా చేసేందుకు ఆపిల్ బాగా పనిచేస్తుంది. ఈ ఆపిల్ లో పెక్టిన్ ఫైబర్, విటమిన్ సి మరియు విటమిన్ కే సమృద్దిగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

దానిమ్మ‌‌ – ఎర్రగా తియ్యగా ఉండే దానిమ్మ వైరస్ పై పోరాడుతుంది. రక్తాన్ని శుభ్రం చేయడం, కొత్తరక్తాన్ని ఉత్పత్తి చేసేందుకు దానిమ్మ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.   బీపీ,గుండె,బరువును తగ్గిస్తుంది

 

 

Latest Updates