ఆ రాష్ట్రాల నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్ కంపల్సరీ

  • కర్ణాటక గవర్నమెంట్ కీలక నిర్ణయం

బెంగళూరు : మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ,తమిళనాడు, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎవరు తమ రాష్ట్రానికి వచ్చిన ఏడు రోజులు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాప్తి నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారు కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో వారం రోజుల పాటు ఉండాలని సూచించింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. మిగతా రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది. బిజినెస్, ఇతర పనుల మీద వచ్చే వారు మాత్రం ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్ ల నుంచి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని తెలిపింది. ఇవి రెండు రోజుల ముందు టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ లు అయి ఉండాలని కండిషన్ పెట్టింది. కరోనా ఎఫెక్ట్ పిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై ఎక్కువగా ఉండటంతో వారంతా కొన్ని రోజుల పాటు బయటకు రావద్దని తెలిపింది.

Latest Updates