గోడపైకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురికి గాయాలు

బెంగుళూరులో ఓ ఆర్టీస్ బస్సు బీభత్సం సృష్టించింది, అదుపు తప్పి ఓ భవనం గోడపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.  బి.ఎమ్.టి.సి. (బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్)కి చెందిన బస్సు అదుపు తప్పి చందాపూర్ లోని ఓ ఇంటి గోడను ఢీకొంది. ప్రమాదం జరిగినపుడు బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.

Latest Updates