యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..7 మంది మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్ జిల్లాలో  లక్నో నుంచి  వెళ్తున్న బస్సు పురాణపూర్ వద్ద  ఎదురుగా వస్తున్న మరో బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది.  ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా 32మంది గాయపడ్డారు. ఇవాళ ఉదయం(శనివారం) 3-4 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పిలిభిత్ జిల్లా ఎస్పీ  జై ప్రకాష్ చెప్పారు.  ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది .. బొలెరోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.  ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పిలిభిత్‌కు చెందినవారని  తెలిపారు.

24 గంటల్లో 62,212 కేసులు.. 837 మంది మృతి

Latest Updates