మరో ఏడుగురికి కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఏడుగురు కరోనా బారినపడ్డారు. ఈ ఏడుగురూ గ్రేటర్ హైదరాబాద్‌కు చెందినవారేనని హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,016కు పెరిగింది. బుధవారం 35 మందిని డిశ్చార్జి చేశారు. ఇందులో 13 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మొత్తంగా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య409కి పెరిగింది. ఇంకా 75 మంది పిల్లలు సహా 582 మంది గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఐసీయూలో పది మంది

ప్రస్తుతం గాంధీలో ట్రీట్ మెంట్ జ‌రుగుతున్నవారిలో పది మంది ఐసీయూలో ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అందులో ఒకరు వెంటిలేటర్‌‌పై ఉన్నారని చెప్పారు. ఇద్దరికి డయాలసిస్‌ చేయిస్తున్నామని, ఒకరు ఓరల్ కేన్సర్‌‌తో, మరొకరు లింఫోమా కేన్సర్‌‌తో బాధ పడుతున్నారని, నలుగురికి గుండె సంబంధిత సమస్యలు, ఒకరికి పాంక్రియాస్ సమస్య ఉందని తెలిపారు. మరో నలుగురు ఆక్సిజన్‌పై ఉన్నారని వెల్లడించారు. ఇక 14 రోజుల పాటు ఐసీయూలో ఉన్నఓ వ్యక్తి కోలుకున్నాడని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్ట‌ర్ రాజారావు తెలిపారు.

11 జిల్లాల్లో నిల్

రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో కరోనా యాక్టివ్ యాక్టివ్ కేసులు లేవని హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ఇందులో సిద్దిపేట, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నారా యణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ ‌‌కర్నూల్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి

Latest Updates