రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో శ‌నివారం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. జీహెచ్ఎంసి పరిధిలో ఆరు కేసులు, వరంగల్ పరిధిలో ఒక కేసు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది. కాగా, ఈ ఏడు కేసులతో కలిపి మొత్తం 990 కేసులు నమోదైనట్టుగా ప్రకటించింది. ఇందులో 658 కేసులు యాక్టివ్ గా ఉండగా, 307 మంది డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించినట్టు హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. తెలంగాణలో త్వరలోనే ర్యాపిడ్ టెస్టులు చేయబోతున్నట్టు సర్కార్ ప్రకటించింది.

ఇక రాష్ట్రంలో కోవిడ్ – 19 వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నేడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. హైదరాబాద్‌‌తో పాటు తెలంగాణలో చేపడుతున్న కరోనా వైరస్ నివారణ నియంత్రణ చర్యల గురించి అడిగి తెలుసుకుంది.

Latest Updates