గుజరాత్ లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు సజీవ దహనం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. రెండు వాహనాలు ఢీకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న డంపర్‌ వెహికల్ కారును ఢీకొట్టడంతో….పక్కనే ఉన్న పొదల్లోకి  దూస్కెళ్లింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని ప్రయాణిస్తున్న వ్యక్తులు అగ్నికి ఆహుతయ్యారు. చోటిలమాత ఆలయానికి వెళ్లి సురేంద్రనగర్‌ వైపు వస్తున్న కారును.. టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డంపర్‌ వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Latest Updates