రేపే చివరి దశ పోలింగ్..23న కౌంటింగ్

7-phase-lokhsabha-elections-on-may-19

లోక్ సభ చివరి దశకు రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు ఆరు విడతల్లో 483 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తవగా రేపు ఏడో విడతలో 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం  ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం చండీగర్ లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ 13,ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 ,బీహార్ 8, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, చండీగర్ ఒక సీటు  కలుపుకొని మొత్తం 59  స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. మే 23 న ఫలితాలు రానున్నాయి.

 

Latest Updates