70వేల ఎకరాలకు నీళ్లు: మంత్రి హరీశ్

harish-kavitha
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నామన్నారు మంత్రి హరీశ్‌రావు. బోధన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రగతి సభకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు కావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ జిల్లా ఎలాంటి అభివృద్ధి చెందలేదని..ఎప్పుడూ బోధన్ కు నీళ్లు రాలేదన్నారు. తాము రూ.1,070 కోట్లతో SRSP పునరుజ్జీవన పథకం చేపట్టామని.. ఈ ఏడాదిలోనే కాళేశ్వరం నీళ్లు SRSP తీసుకొస్తున్నమన్నారు. నిజాంసాగర్‌కు మల్లన్నసాగర్ ద్వారా కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. ప్యాకేజీ 20,21 ద్వారా బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు.

Posted in Uncategorized

Latest Updates