వైరస్ టెన్షన్ : ఆస్పత్రి నుంచి పారిపోయిన 70మంది కరోనా పేషెంట్స్

ఓ ఆస్పత్రికి చెందిన వార్డ్ లో  70మంది కరోనా వైరస్ పేషెంట్లు పారిపోవడం కలకలం రేపుతోంది. ముంబై లైవ్ కథనం ప్రకారం.. ముంబైలోని మలాద్ ప్రాంతంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాపించిన వివరాలకు చెందిన రికార్డ్ లను అధికారులు చెక్ చేశారు. అందులో సుమారు 70మంది బాధితులు అదృశ్యమైనట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన బ్రిహాన్ ముంబై మున్సిపాలిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో ఆ ఆస్పత్రికి చెందిన సి – నార్త్ వార్డ్ నుంచి తప్పించుకున్న 70మంది బాధితుల వివరాల్ని పోలీసులు సేకరించారు. అయితే ఆస్పత్రి లో దొరికిన వివరాల ఆధారంగా బాధితుల ఇళ్లకు వెళ్లగా అడ్రస్ లు లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పోలీసులకు కష్టతరంగా మారింది.

దీంతో ఐఎంఈఐ నెంబర్ ద్వారా  బాధితుల వివరాల్ని సేకరిస్తామని పోలీసులు తెలిపారు. మరో వైపు మహరాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ బాధితులకు ట్రీట్ మెంట్ అందించడంలో విఫలమైంది. దీంతో ట్రీట్ మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం.. కరోనా వైరస్ సోకిన బాధితుల్ని పశువుల కంటే హీనంగా చూడడం దారుణమని విమర్శలు చేసింది.

Latest Updates