పీవీ సింధుతో పెళ్లి చేయకుంటే కిడ్నాప్ చేస్తా: 70 ఏళ్ల తాత

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆట తీరు చూసి అందరం ముచ్చటపడతాం. ప్రపంచ స్థాయిలో మన తెలుగు అమ్మాయి సాధిస్తున్న ఘన విజయాలను చూసి మెచ్చుకుంటాం. ఇది అందరూ చేసే పనే. కానీ తమిళనాడులోని ఓ తాత చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది.

పీవీ సింధు గేమ్ చూసి నేను ఫిదా అయ్యా. ఆమెతో నాకు పెళ్లి చేయండి’ అంటూ తమిళనాడుకు చెందిన ఓ 70 ఏళ్ల తాత గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఆమెతో పెళ్లి చేయకపోతే సింధును కిడ్నాప్ చేసేస్తానంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఈ విషయాన్ని నేరుగా తమిళనాడులోని రామాంతపురం జిల్లా కలెక్టర్ కే చెప్పాడా ముసలాయన.

సింధుతో పెళ్లి చేయాలంటూ వచ్చిన ఆ తాత  పేరు మళైసామి. సోమవారం రామాంతపురం కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టర్ నిర్వహించిన కార్యక్రమానికి వచ్చాడా తాత. సింధు ఆట తీరు తనకు ఎంతో నచ్చిందని, తను కెరీర్ లో బాగా ఎదుగుతోందని, ఆమెతో తనకు పెళ్లి చేయాలని అర్జీ ఇచ్చాడు. సింధు ఫొటో, తన ఫొటో ఇచ్చి పెళ్లి పనులు మొదలుపెట్టాలని కలెక్టర్ ని కోరాడు.

పైగా తన వయసు 16ఏళ్లేనని, సింధు తన కంటే పెద్దని (24 ఏళ్లు), అయినా ఆమెనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఒకవేళ సింధుతో వివాహానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోతే తాను ఆమెను కిడ్నాప్ చేస్తానని హెచ్చరించాడు.

ఇదంతా చూసి అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇది జోకులు వేసే చోటు కాదని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసి వేదిక అని అధికారులు చెప్పి ఆ పెద్దాయన్ని పంపేశారు.

70-year-old wants to marry PV Sindhu

Latest Updates