రోడ్డు ప్ర‌మాదంలో వృద్ధుడు మృతి

అమ‌రావ‌తి: రోడ్డు ప్ర‌మాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న గురువారం విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. విజ‌య‌వాడ‌లోని ఎనిమిదో టౌన్ పోలీస్టేష‌న్ ప‌రిధిలో వృద్ధుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వ‌చ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ వృద్ధుడిని స‌మీపంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందినట్లు తెలిపారు డాక్ట‌ర్లు. మృతుడు అదే ప్రాంతానికి చెందిన రాముగా గుర్తించిన పోలీసులు.. కారు డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశామ‌న్నారు.

Latest Updates