ఎస్ఎస్ఏలో 704 పోస్టులు

ఆన్​లైన్ ​దరఖాస్తు ప్రక్రియ షురూ

హైదరాబాద్‌, వెలుగు: సంస్థలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 704 ఖాళీలను భర్తీకి సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బుధవారం నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్స్​ స్వీకరిస్తోంది. షెడ్యూల్​ ప్రకారం ఆన్​లైన్​ అప్లికేషన్​ ప్రాసెస్​ను​ ఈ నెల 18 న ప్రారంభించి, 23తో ముగించాలి. రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించడంతో ఆమేరకు గడువు పొడిగిస్తామని ఎస్ఎస్ఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డిసెంబర్​ రెండో వారంలో రాతపరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

ఎస్ఎస్ఏలో రాష్ట్రవ్యాప్తంగా ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ 144 పోస్టులు, డాటాఎంట్రీ ఆపరేటర్లు 138, సిస్టమ్‌ ఎనలిస్ట్‌ 12, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌ 27, ఐఈఆర్పీ383 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడున్న కాంట్రాక్టు ఉద్యోగులను వచ్చే నెల మొదటి వారంలో ట్రాన్స్​ఫర్​ చేస్తామని, దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates