నెల్లూరు జైలులో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

  •  ఆందోళనలో మిగతా ఖైదీలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా కారాగారంలో కొత్తగా మరో 20 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.దీంతో నెల్లూరు జైలులో పాజిటివ్‌ వచ్చిన ఖైదీల సంఖ్య 72కి చేరింది. రెండు రోజులుగా జైలులోని ఖైదీలకు సంజీవని బస్సు ద్వారా కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు నిర్వహించిన పరీక్షల్లో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో మిగతా వారికి రెండో రోజు చేసిన పరీక్షల్లో 20 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారని జైలు సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు చెప్పారు. కరోనా సోకిన వారికి ప్రత్యేక ఐసోలేషన్‌ గదులు కేటాయించినట్లు చెప్పారు. జైలులోని అన్ని గదులను శానటైజేషన్‌ చేయించినట్లు చెప్పారు.

Latest Updates