ఒక్కరోజులోనే 73 కరోనా కేసులు

న్యూఢిల్లీ:  దేశంలో గురువారం ఒక్కరోజులోనే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలకు పైచిలుకు చేరగా.. మరణాల సంఖ్య 1,100 దాటింది. మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఈ నెల 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తర్వాత పాక్షిక లాక్ డౌన్ వేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. పార్షియల్ లాక్ డౌన్ తో సేఫ్ జోన్స్ లో ముఖ్యమైన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైరస్ ను నియంత్రించడంలో లాక్ డౌన్ హెల్ప్ అయిందని కేంద్రం చెప్తోంది. లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టంపై విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. గ్రీన్ జోన్ కోసం లాక్ డౌన్ నియమాలను సడలించడంతోపాటు చిన్న వ్యాపారులకు భారీ క్రెడిట్ రిలీఫ్ ప్యాకేజీ ఇచ్చే చాన్సెస్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ గురించి మూడో తేదీలోపు సర్కార్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Latest Updates