ఏపీలో 1300 దాటిన కరోనా కేసులు

  • 24 గంటల్లో 73 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 1332కి చేరింది. 24 గంటల్లో 73 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ విదుడల చేశారు. 287 మంది వ్యాధిని కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. 31 మంది చనిపోయారు. వివిధ హాస్పిటల్స్‌లో మొత్తం 1014 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని అధికారులు చెప్పారు. 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించామని అన్నారు. బుధవారం గుంటూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లాలో కేసులు 283కి చేరాయి. కర్నూల్‌ జిల్లాలో సంఖ్య 343కి చేరింది. 11 నెలల పాపకు కరోనా సోకినట్లు అధికారులు చెప్పారు.

జిల్లాల వారీగా వివరాలు

Latest Updates