75 రోజులు.. రూ.6.85కోట్లు: జయలలిత ట్రీట్ మెంట్ ఖర్చు

తమిళనాడు దివంగత సీఎం జయలలిత ట్రీట్ మెంట్ కు అయిన ఖర్చు వివరాలు బయటకొచ్చాయి. జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమవ్వడంతో.. ఆమె మరణంపై విచారణ కమిటీ వేశారు. అయితే ఈ కమిటీకి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్టు లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. జయలలిత ట్రీట్ మెంట్ కు సుమారు రూ. 6.85 కోట్లు ఖర్చయినట్లు అపోలో తన రిపోర్టులో తెలిపింది.

కేవలం తిండి ఖర్చులకే 1.17 కోట్లు అయినట్లు ఆ రిపోర్టులో ఉంది. జయలలితకు ట్రీట్ మెంట్ అందించిన యూకేకు చెందిన డాక్టర్ రిచర్డ్ బేలేకు రూ.92 లక్షలు..ఫిజియోథెరపీ చికిత్స అందించిన సింగపూర్ కు చెందిన మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ కు ఫీజు కింద రూ.1.29 కోట్లు చెల్లించారు.  ఆమె ట్రీట్ మెంట్ కు సంబంధించి ఇంకా రూ. 44.56 లక్షలు చెల్లించాల్సి ఉందని అపోలో తన రిపోర్టులో తెలిపింది. అనారోగ్యంతో సెప్టెంబర్ 22,2016న అపోలో హాస్పిటల్ లో చేరిన జయలలితకు 75 రోజుల పాటు చికిత్స అందించారు. అదే ఏడాది డిసెంబర్ 5న ఆమె మరణించారు.

Posted in Uncategorized