ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో 75 మందికి కరోనా

న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా బాబు జగ్జీవన్ రాం హాస్పిటల్ లో 75 మంది స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. హాస్పిటల్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు కరోనా సోకింది. దీంతో మిగతా స్టాఫ్ అందరినీ క్వారంటైన్ కు పంపించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 3 వేలు దాటింది. ఇప్పటి వరకు 877 మంది కోలుకున్నారు. ఢిల్లీలో 13 రోజుల కొకసారి కేసులు రెట్టింపు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీలో లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ జనం జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Latest Updates