ఏపీలో క‌రోనా విజృంభ‌ణ.. ఒక్క‌రోజే 80 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,655 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 80 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,116కు చేరింది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, సోమవారం 46 వేలకు పైగా పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఆదివారం కావడంతో కరోనా పరీక్షలు తగ్గించినట్లు తెలుస్తోంది.

క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఏపీలో వేగంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 80 మంది మరణించారు. ప్రకాశంలో 11 మంది, గుంటూరులో 10 మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్టణంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు చనిపోయారు.

Latest Updates