ముంబై జైలులో 103 మందికి కరోనా

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 103 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. జైలులో వంటమనిషికి వైరస్ సోకడంతోనే మిగతా వారికి వ్యాపించిందని, ఇందులో 77 మంది ఖైదీలు, 26 మంది సిబ్బంది ఉన్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్​ముఖ్ మీడియాకు తెలిపారు. ‘‘ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ లో ఒకరికి వైరస్ సోకినట్లు కన్ఫామ్ కాగానే మిగతావారందరికీ టెస్టులు నిర్వహించాం. 77 మంది ఖైదీలు, 26 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. వీరందరికీ సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ అందిస్తున్నాం” అని మంత్రి చెప్పారు. జైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడిన 5,000 మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని దేశ్​ముఖ్ చెప్పారు.

Latest Updates