దేశ వ్యాప్తంగా లాక్ డౌన్.. పోకెమాన్ ఆడుతూ వీధుల్లో తిరుగుతున్న 71ఏళ్ల వ్యక్తి అరెస్ట్

చైనా నుంచి పుట్టుకొచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ఇండియా టుడే తెలిపిన వివరాల ప్రకారం 168దేశాల్లో 4,00,000 మందికి పైగా వ్యాపించింది. వైరస్ తో 18,000మంది మరణించారు. అయితే కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ఆయా దేశాధినేతలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ హోం క్వారైంటన్ తో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అదే సమయంలో కొంతమంది లాక్ డౌన్ నుంచి తప్పించుకొని ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. అలాంటి సంఘటనే స్పెయిన్ లో జరిగింది. స్పెయిన్ మాడ్రిడ్‌లో పోకెమాన్ ఆడేందుకు 77ఏళ్ల వ్యక్తి వీధుల వెంట తిరుగుతున్నాడు. వీధులు వెంట తిరుగుతూ ఫోన్ లో లీనమైన ఆయన్ను పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణ సందర్భంగా పోకెమాన్ గేమ్ ను ఆడేందుకు వీధుల వెంటతిరుగుతున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాడ్రిడ్ పోలీస్ డిపార్ట్ మెంట్  లాక్ డౌన్  సమయంలో పోకెమాన్, డైనోసార్ లేదా ఇతర ప్రాణులను వేటాడటం నిషేధం అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కేసుల  అకస్మాత్తుగా పెరగడంతో మార్చి 14నుంచి లాక్ డౌన్ ప్రకటించింది.

Latest Updates