మహిళా హవా – లోక్ సభకు 78 మంది ఎన్నిక

మహిళా రిజర్వే షన్ బిల్లు సంగతేమోగానీ, దాంతో సంబంధం లేకుం డా ఈసారి ఎన్నికల్లో 78 మందిమహిళలు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇంత పెద్దసంఖ్యలో మహిళలు లోక్‌సభకు ఎన్నికవడం ఇదేతొలిసారి. రద్దయిన లోక్‌సభలో 62 మందిమాత్రమే మహిళా ఎంపీలు ఉండేవారు. స్మృతిఇరానీ, మిమి చక్రవర్తి, సుమలత, ప్రజ్ఞా ఠాకూర్‌ వంటి వారు ఫస్ట్‌ టైమ్‌ ఎన్నికయ్యారు. అతి చిన్నవయసులో ఎంపీ అయిన రికార్డును ఒడిశాఅమ్మాయి చంద్రాణి సొంతం చేసుకుం ది.

తాజా పార్లమెంట్‌‌ ఎన్ని కల్లో ఆడవారు సత్తా చాటారు. ఈ జనరల్‌ ఎలక్షన్స్‌‌ని దాదాపు అన్ని పార్టీలూ ఆడవారికి తగినన్ని సీ ట్లు ఇవ్వాలన్ననిర్ణయం తీసుకున్నా యి. బిజూ జనతాదళ్‌ (బీజేడీ)చీఫ్‌‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించగా, తృణమూల్‌ చీఫ్‌‌, వెస్ట్‌‌ బెంగాల్‌ సీ ఎం మమతా బెనర్జీ 41 శాతం ఎంపీ సీట్లను ఆడవారికి కేటాయిస్తామన్నా రు. ఈఎన్నికల్లో  మొత్తం 715 మంది పోటీ చేస్తే 78 మంది విజయం సాధించారు. అత్యధికంగా 80 లోక్‌ సభ సెగ్మెం ట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి 104 మంది ఆడవారు పోటీ చేశారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడుది. ఈ దక్షిణాది రాష్ట్రం నుంచి ఈసారి 64 మంది పోటీ చేశారు. బీహార్‌‌లో 55 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 54 మంది బరిలో నిలిచారు. పార్టీల పరంగా పోటీ చేసిన వారి

వివరాలు : కాం గ్రెస్ తరఫున 54మంది,  బీజేపీ తరఫున 53 మంది, బహుజన్ సమాజ్పార్టీ టికెట్ పై 24 మంది,  తృణమూల్ కాం గ్రెస్ టికెట్ పై 23 మంది, సీ పీఐ (ఎం) తరఫున 10 మంది, సీపీఐ టికెట్ పై నలుగురు, నేషనలిస్ట్ కాం గ్రెస్ పార్టీ తరఫున ఒకరు పోటీ చేశారు.

గెలిచిన 78 మందిలో27 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నా రు. వీరిలో ఉత్తర-ప్రదేశ్, పశ్చిమ బెం గాల్ రాష్ట్రాల నుంచి 11మందిచొప్పున ఉన్నా రు. మొదటి జనరల్‌ ఎలక్షన్స్‌‌ (1952)నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీస్తే ఇంత పెద్ద సంఖ్యలోఆడవారు లోక్‌ సభకు ఎన్ని క కావడం ఇదే ఫస్ట్ టైమ్.

బీజేపీ నుంచి 16 మంది సిట్టిం గ్‌ ల విజయం

బీజేపీకి చెం దిన 16 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. వీరిలో హేమమాలిని (మథుర), మేనకా గాం ధీ (సుల్తాన్ పూర్), కిరణ్ ఖేర్ (చండీగఢ్), మీనాక్షి లేఖి (న్యూఢిల్లీ )ఉన్నారు. వివాదాస్పద కామెంట్లతో అందరి దృష్టినీ ఆకర్షించిన  ప్రజ్ఙా ఠాకూర్ భోపాల్ సెగ్మెంట్‌‌లో మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ ని ఓడించారు. పంజాబ్‌ లోని రాజకీయ కుటుంబాలకు చెందిన ఆడవారు కూడా ఈసారి గెలి చిన వారిలోఉన్నారు. వీరిలో పంజాబ్ ముఖ్యమంత్రి  కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఉన్నా రు. శిరోమణి అకాలీదళ్ ( ఎస్ఏడీ ) కేండి డేట్‌‌ని ఓడించి పాటియాలా సె గ్మెం ట్ నుంచి ప్రణీత్‌‌ విజయం సాధించారు. అలాగే శి రోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్ బీర్ బాదల్ భార్య, కేం ద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్‌ లోని భటిండా నియోజకవర్గం నుంచి గెలి చారు. డీఎంకే సీ నియర్ నేత కనిమొళితూత్తుకుడి నుంచి గెలి చారు. తృణమూల్ కాం గ్రెస్ టికెట్‌‌పై పోటీ చేసి గెలి చినవారిలో ను స్రత్ జహాన్,మిమి చక్రవర్తి ఉన్నా రు. నుస్రత్ జహాన్ బషీర్ హాట్నియోజకవర్గం నుంచి, సినీ నటి మిమి చక్రవర్తి జాదవ్‌‌పూర్ సెగ్మెంట్ నుంచి గెలి చారు. అలాగే శతాబ్ది రాయ్ కూడా విజయం సాధించారు.

ఈసారి ఎన్ని కల్లో ఓడిన మహిళా ప్రముఖుల లేకపోలేదు. జయప్రద, ఊర్మిళా మటోండ్కర్, కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా భార్య  పూనం సిన్హా , సమాజ్‌‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్,పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ , టీఆర్ఎస్ సిట్టిం గ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ లోనూ ఓడిపోయారు.

రాహుల్ నే ఓడించింది

అమేథీలో కాం గ్రెస్ చీఫ్ రాహుల్ గాం ధీని ఓడించిన ఘనత కేం ద్ర మంత్రి స్మృతి ఇరానీకి దక్కుతుంది. ఆమె 2014లో ఇదే స్థానంలో రాహుల్‌ చేతిలో ఓడిపోయినప్పటికీ కుంగిపోలేదు. అమేథీని నమ్ముకుని పనిచేశారు. చివరకు విజయం దక్కిం చుకున్నా రు. ఉత్తర-ప్రదేశ్‌‌లోని అమేథీ సె గ్మెంట్‌‌కి ఇందిరా గాంధీకుటుంబ నియోజకవర్గంగా రాజకీయ వర్గాల్లో పేరుం ది. సంజయ్‌‌ గాం ధీ, రాజీవ్‌‌ గాం ధీ.,రాహుల్‌ గాం ధీ ఇక్కడి నుంచే లోక్‌ సభలోఅడుగు పెట్టారు. రాహుల్‌  వైఫల్యాలే తనకు ఆయుధంగా స్మృతి ఇరానీ మలుచుకున్నా రు.తరచూ నియోజకవర్గం లో పర్యటించారు.ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నా రు. వారి సమస్యలు ఓపికగా విన్నా రు. జనంతో మమేకం అయ్యారు. ఈ కష్టమే ఆమెను లేటెస్ట్ ఎన్నికల్లో  గెలిపించింది.

బీజేపీ ఎంపీలే అధికం

ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగిన మొత్తం 715మంది ఆడవారిలో 78మంది గెలి చారు.వీరిలో బీజేపీ తరఫున లోక్‌సభలో అడుగు పెట్టినవారు 34 మంది. కేవలం పొలి టికల్‌ కుటుంబాల నుంచి కాకుండా సమాజంలోని వివిధ రంగాలకు చెందినవారిని, ఐఏఎస్‌ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసెస్‌లో కొనసాగుతున్నవారిని బీజేపీ ఎంపిక చేసుకుంది. ఒడిశాలోని భువనేశ్వర్‌ లోక్‌సభా స్థానం నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి అపరాజిత సారంగి గెలి చారు. ఆమె ఒడిశా క్యా డర్ లో గ్రామీణా-భివృద్ధి శాఖ జాయింట్‌ సె క్రటరీగా పనిచేస్తూ బీజేపీలో చేరారు.

అతి చిన్న వయసు ఎంపీ

ఒడిశాలోని కియోంఝర్‌ సీటు నుంచి బీజేపీటికెట్ పై నెగ్గిన చంద్రాణి అతి చిన్న వయ-సులోనే లోక్‌సభలో అడుగు పెట్టనున్నా రు.ఫలితాలు వెలువడేనాటికి ఆమె వయసు 25ఏళ్ల 11 నెలల 9 రోజులు. మెకానికల్‌ ఇం-జినీరింగ్‌ పూర్తి చేసుకుని ఒడిశా ప్రభుత్వం నిర్వహిం చిన ఏఎస్‌ఓ ఉద్యోగానికి, బ ్యాంక్‌ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టుకు న్న తరుణంలో ఆమెను అదృష్టం వరించిం ది. కియోంఝార్‌ ఎస్టీ రి జర్వుడ్‌ సీటులో బీజేడీ తరఫున రెం డుసార్లు గెలి చినఅనంత నాయక్‌ని 66 వేల ఓట్లతో చంద్రాణి ఓడించింది.

Latest Updates