భ‌యం మింగేసింది: క‌రోనా టెస్ట్ రిపోర్ట్ రాక‌ముందే ఆస్ప‌త్రిపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌

రోగం క‌న్నా భ‌యం చాలా ప్ర‌మాద‌కర‌మైన‌ది. క‌రోనా సోకిందేమోన్న ఆందోళ‌న‌తో ఓ వ్య‌క్తి ఆస్ప‌త్రి భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చివ‌రికి అత‌డి టెస్టు రిపోర్ట్ నెగ‌టివ్ అని వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌ రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో జ‌రిగింది.

జైపూర్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధుడికి జ్వ‌రం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా అనిపించ‌డం వంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జైపూర్‌లోని రాజ‌స్థాన్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్స్ సైన్సెస్ (RUHS) ఆస్ప‌త్రిలో ఐసోలేష‌న్ వార్డులో ఉంచి.. అత‌డి శాంపిల్స్ సేక‌రించారు వైద్యులు. అయితే త‌న‌కు క‌రోనా సోకి ఉంటుంద‌న్న భ‌యంతో బుధ‌వారం ఉద‌యం ఆస్ప‌త్రిలోని రెండో అంత‌స్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్ర‌మైన గాయాలైన అత‌డు ప్రాణాలు విడిచాడ‌ని వైద్యులు ధ్రువీక‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఆ వృద్ధుడి క‌రోనా టెస్టు రిపోర్ట్ రాగా, నెగ‌టివ్ అని తేలింద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు ఏసీపీ విష్నోయి సంగ‌నేర్ తెలిపారు.

Latest Updates