ఏపీలో కొత్తగా 7,855 కేసులు..52 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7,855 కరోనా కేసులు నమోదుకాగా..వైరస్ తో 52 మంది చనిపోయారని తెలిపింది వైద్యారోగ్యశాఖ. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 6,54,385కి కరోనా కేసులు చేరాయని చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం 5,558 మరణాలు సంభవించాయని తెలిపిన ఆరోగ్యశాఖ.. ప్రస్తుతం ఏపీలో 69,353 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి 5,79,474 మంది రికవరీ అయ్యారని..గడచిన 24 గంటల్లో 76వేల మంది కరోనా టెస్టులు నిర్వహించామని చెప్పింది. ఇప్పటివరకు 53.78 లక్షల కరోనా టెస్టులు నిర్వహించామని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.

కొత్తగా నమోదైన కరోనా రిపోర్ట్ వివరాలు:

 

Latest Updates