7,990 మంది ఇండియన్లకు గ్రీన్‌‌కార్డ్‌‌

  • ఈబీ2, ఈబీ3 కేటగిరీ కింద ఇష్యూ చేసిన వాటిలో 10%
  • మనోళ్లకు వెయిటింగ్‌‌ టైమ్‌‌ 49 ఏండ్లు

అమెరికా గ్రీన్‌‌ కార్డు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. యూఎస్‌‌లో శాశ్వత నివాసం ఉండాలంటే ఈ కార్డుండాల్సిందే. గతేడాది అమెరికాలో 7,990 మంది ఇండియన్లకు ఈ గ్రీన్‌‌కార్డులిచ్చారు. మొత్తం ఈబీ2 (అడ్వాన్స్డ్‌‌ డిగ్రీ), ఈబీ3 (హై స్కిల్డ్‌‌ వర్కర్స్‌‌) కేటగిరీ అప్లికేషన్లలో ఇవి10 శాతం. 2018తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. అప్పడు 10,208 మందికి (13 శాతం) కార్డులిచ్చారు. సాధారణంగా ఉద్యోగుల కోసం ఏటా 1.4 లక్షల గ్రీన్‌‌ కార్డులను అమెరికా పక్కనబెడుతుంటుంది. ఇందులో ఒక్కోదేశానికి 7 శాతమే ఇచ్చేలా రూల్‌‌ (కంట్రీ క్యాప్‌‌) పెట్టారు. దీని వల్ల అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇండియన్లకు గ్రీన్‌‌కార్డులు అందట్లేదు. 2018 మే నాటికి మొత్తం 5.86 లక్షల మంది ఈబీ2, ఈబీ3 కేటగిరీ వర్కర్లు గ్రీన్‌‌ కార్డు కోసం వెయిట్‌‌ చేస్తున్నారు. వీళ్లలోని ఇండియన్లకు గ్రీన్‌‌ కార్డు రావడానికి వెయిటింగ్‌‌ టైం 49 ఏండ్లు. అదే చైనా వాళ్లకు 6 ఏండ్లు పడుతోంది.

కంట్రీ క్యాప్‌‌ వద్దు

2018లో ఈబీ2, ఈబీ3 కేటగిరీల్లో 48,596 మందికి గ్రీన్‌‌ కార్డు ఇవ్వడానికి కంపెనీలు అప్రూవ్‌‌ చేశాయి. ఇది 2019లో 52,503కు పెరిగింది. గ్రీన్‌‌ కార్డు ఇవ్వమని కంపెనీలు అప్రూవ్‌‌ చేయడం కార్డు అప్లికేషన్లలో తొలి స్టెప్‌‌. తర్వాత కార్డు రావడానికి ఇండియన్లకు ఏండ్లు పడుతోంది. 2009లో అప్లై చేసిన వాళ్లు కూడా ఇప్పటికీ కార్డు కోసం వెయిట్‌‌ చేస్తున్నారు. కంట్రీ క్యాప్‌‌ విధించడం అన్యాయమని, దేశాన్ని బట్టి వివక్ష చూపడం సరికాదని  కొందరు అంటున్నారు. దీనిపై అమెరికా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Latest Updates