7హెచ్‌ మీడియా ప్రీమియర్‌ లీగ్‌‌ : వీ6 టీమ్‌ గ్రాండ్‌ విక్టరీ

7హెచ్‌ మీడియా ప్రీమియర్‌ లీగ్‌‌

హైదరాబాద్‌ : 7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ సెకండ్‌ సీజన్‌ ను వీ6 క్రికెట్‌ టీమ్‌ గ్రాండ్‌ విక్టరీతో స్టార్ట్​ చేసింది. దుండిగల్‌ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోమవారం జరిగిన ఫస్ట్ మ్ యాచ్​లో వీ6 టీమ్​ 63 రన్స్​ తేడాతో డెక్కన్ ​క్రానికల్‌ ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వీ6 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. ఓపెనర్‌ సదానందం ​(36 బాల్స్‌ లో 8 ఫోర్లు, 1 సిక్ స్‌ తో 51) హాఫ్‌ సెం చరీ చేయగా.. శ్రావణ్‌‌ (40) రాణించాడు. అనంతరం ఛేజింగ్‌ లో డెక్కన్ క్రానికల్ 16.4 ఓవర్లలో 91 రన్స్‌ కే ఆలౌటైంది. వీ6 బౌలర్లలో
ప్రేమ్‌ కుమార్​ (3/20), శ్రీకాంత్​రెడ్డి (2/14), ఎండీ మదార్​(2/14) రా ణించా రు. ప్రేమ్‌ కుమార్​కు బెస్ట్‌‌ బౌలర్‌ , సదానందంకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్ యాచ్‌ అవార్డులను టీఆర్‌ ఎస్‌ మల్కాజ్‌ గిరి పార్లమెంట్ ఇంచార్జ్‌‌ రాజశేఖర్‌ రెడ్డి , టోర్నీ స్పాన్సర్‌ , నంది టైర్స్‌ ఎండీ భరత్‌ రెడ్డి అందించారు. అంతకుముందు ఎంఎల్​ఆర్​ఐటీ చైర్మన్​ మర్రి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు.

Latest Updates