8జీబీ ర్యామ్, 128జీబీ మెమొరీతో ఒప్పో ఆర్17 ప్రో

రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తున్న ఈ టైంలో కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు మొబైల్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. రీసెంట్ గా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో..ఆర్ సిరీస్ లో అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో ఆర్17 ప్రోను ఇవాళ(డిసెంబర్ 5) ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు సెల్ఫీ కెమెరా 25 మెగాపిక్సెల్ ఉండటం హైలెట్ ఫీచర్లు.

6.4 ఇంచెస్ బిగ్ డిస్ ప్లే తో వస్తోన్న ఈ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఉన్న సూపర్ వూక్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్‌ తో ఫోన్ 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.రేడియంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వేరియెంట్లలో రిలీజైన ఈ ఫోన్ ధరను రూ.45,990 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ డిసెంబర్ 7న ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యం కానుంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీ  క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక పేటీఎం మాల్ లో ఈ ఫోన్ పై రూ.3వేల క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.

ఒప్పో ఆర్17 ప్రో స్పెసిఫికేషన్స్..

6.4 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే

గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్

25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

12,20 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా

8 జీబీ ర్యామ్,128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ Oreo 8.1 ఆపరేటింగ్ సిస్టం

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్

3700 mAh బ్యాటరీ

Posted in Uncategorized

Latest Updates