8 నిమిషాలకో మెట్రో..రద్దీవేళల్లో 6.30 నిమిషాలకే 

హైదరాబాద్ అమీర్‌పేట నుంచి LB నగర్‌ వరకు నిన్న( శనివారం) మెట్రోరైలు ట్రయల్‌రన్స్‌ ముమ్మరంగా నిర్వహించారు. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మెట్రోను ఈ మార్గంలో రోజంతా తిప్పారు. రేపు (సోమవారం,సెప్టెంబర్-24) మధ్యాహ్నం గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి ఈ మార్గాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు ప్రస్తుతం రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు, మిగతా సమయాల్లో 8 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. మిగతా మార్గం ప్రారంభం తర్వాత ఇదే విధంగా ఉంటుందని ప్రయాణికుల స్పందనను బట్టి ముందు ముందు తగ్గిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మాత్రం 8 నిమిషాల ఫ్రీక్వెన్సీనే అని తెలిపాయి.

మియాపూర్‌ నుంచి LB నగర్‌ వరకు ఒకే మెట్రో మార్గం. పనులు పూర్తికాక పోవడంతో మొదట మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు గతేడాది నవంబరులో ప్రారంభించారు. మిగిలిన మార్గాన్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates