8 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

కొత్తగూడెం : ఇటీవల జరిగిన అంసెబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల శిక్షణా తరగతులకు గైర్హాజరైన 18మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. గైర్హాజర్ కు సరైన కారణాలు చూపిన 8 మందిపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ.

వారి వివరాలు ఇలా ఉన్నాయి..

వెంకటాపురం మండలం ఏహెచ్‌ఎస్‌ లక్ష్మణ్‌ గ్రామానికి చెందిన బి. సురేష్‌

ములకలపల్లి మండలంలో జీపీఎస్‌ తోగ్గూడెంలో ఎస్‌ జీటీగా పనిచేస్తున్న కే. రాజేష్‌

పినపాక మండలం జీపీఎస్‌ బోటిగూడెంలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న కే.రాజయ్య

బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు జడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి. శ్రీనివాసరావు

అశ్వాపురం మండలం జడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్‌. వెంకటేశ్వర్లు

కొత్తగూడెం మండలం సింగరేణిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి. బాలకృష్ణ

టేకులపల్లి మండలం బావోజీతండా ఎంపీపీఎస్‌ పాఠశాలలో ఎస్‌ జీటీగా పనిచేస్తున్న బి.విజయ

వెంకటాపురం మండలం చిరుతపల్లి-1 ఆశ్రమ హైస్కూల్‌లో ఎస్‌జీటీగా పని చేస్తున్న ఎ. పార్వతి

Posted in Uncategorized

Latest Updates