8 స్థానిక సంస్థ‌ల‌కు ఉత్త‌మ పంచాయ‌తీ అవార్డులు

tslogoరాష్ట్రంలోని ఎనిమిది స్థానిక సంస్థ‌ల‌కు ఉత్త‌మ పంచాయ‌తీ అవార్డులు ద‌క్కాయి. ఏప్రిల్ 24న జాతీయ పంచాయ‌తీ దివస్ సంద‌ర్భంగా ఈ అవార్డుల‌ను ప్ర‌తి ఏటా కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తోంది. ఈ ఏడాదికి దీన‌ద‌యాల్ ఉపాధ్యాయ్ పంచాయ‌తీ స‌శ‌క్తి క‌ర‌ణ్ పుర‌స్కార్‌ను తెలంగాణాలోని ఒక జిల్లా ప‌రిష‌త్‌తో పాటు…రెండు మండ‌ల ప‌రిష‌త్‌ల‌ను, మ‌రో నాలుగు గ్రామ పంచాయ‌తీల‌ను కేంద్రం ఎంపిక చేసింది. జిల్లా ప‌రిష‌త్ విభాగంలో ఆదిలాబాద్‌, మండ‌ల ప‌రిష‌త్ విభాగంలో సిద్దిపేటతో పాటు పెద్దప‌ల్లి జిల్లా శ్రీ‌రాంపూర్ మండ‌ల ప‌రిష‌త్‌కు అవార్డు ద‌క్కింది.

గ్రామ‌పంచాయ‌తీ విభాగంలో రాజ‌న్న సిరిసిల్ల మండ‌లం ముష్టిప‌ల్లి, సిద్దిపేట మండ‌లం ఇర్కోడు, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌న‌గ‌ర్ మండ‌లం గంట్ల‌వ‌ల్లి, క‌రీంన‌గ‌ర్ జిల్లా రామ‌డుగు మండ‌లం వెలిచాలకు అవార్డులను ద‌క్కించుకున్నాయి. జిల్లా ప‌రిష‌త్‌కు రూ. 50 ల‌క్ష‌లు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు రూ. 25 ల‌క్ష‌లు, గ్రామ‌పంచాయ‌తీల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రూ. 8 నుండి 12 ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహకం కేంద్రం అంద‌జేయనుంది. అలాగే నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌర‌వ్ గ్రామ స‌భ అవార్డును క‌రీంన‌గ‌ర్ జిల్లా సైదాపూర్ మండ‌లం దుద్దెన‌ప‌ల్లి ద‌క్కించుకుంది. ఈ కేట‌గిరి కింద దాదాపు రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహ‌కం ద‌క్క‌నుంది. జాతీయ పంచాయ‌తీ దివ‌స్ ను పుర‌స్క‌రించుకుని ఈ నెల 24న‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో 2016-17తో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన అవార్డు గ్ర‌హీత‌ల‌కు కేంద్రం పుర‌స్కారాలు అంద‌జేయ‌నుంది. అవార్డు గ్ర‌హీత‌ల‌కు  మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates