సినీ న‌టి రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్ళు.. కారు డ్రైవర్ అరెస్ట్

చెన్నై: ప్ర‌ముఖ సినీ న‌టి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం ప‌ట్టుబ‌డింది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డు చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర‌ కనత్తూరు పోలీసులు ఆమె కారులో తనిఖీలు చేయ‌గా 8 మద్యం బాటిళ్ళు బ‌య‌ట‌ప‌డ్డాయి. త‌నిఖీల సమయంలో రమ్యకృష్ణ, ఆమె సోదరుడు వినయ కృష్ణ కారులోనే ఉన్నారు. కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం బెయిల్ పై విడుద‌ల చేశారు.

చెన్నైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ మద్యం విక్రయాలు బంద్ చేసింది. ఈ క్ర‌మంలో సినీ న‌టి ర‌మ్య‌కృష్ణ కారులో మ‌ద్యం బాటిళ్లు దొర‌క‌‌డం క‌ల‌క‌లం రేపింది. లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తుండడంతో కారును కూడా సీజ్ చేశారు పోలీసులు. ఈ విష‌యంపై రమ్యకృష్ణ ఇంకా స్పందించలేదు.

Latest Updates