మరోకరికి పాజిటివ్.. ఏపీలో 8కి చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. లండన్ నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ర్టంలో 251 కరోనా సస్పెక్టివ్ కేసుల్లో శాంపిల్స్ ను తిరుపతి రుయా ల్యాబ్లో పరిశీలించగా, 168 మందికి నెగెటివ్ వచ్చిందని పేర్కొంది. మంగళవారం 62 మంది శాంపిల్స్ లో పరిశీలించగా ఒకరికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. మరో 14 కేసుల్లో రిజల్ట్ రావాల్సి ఉందని తెలిపింది. రోజుకు 60 మందికి కరోనా టెస్టులు చేసేందుకు వీలుగా కొత్తగా తిరుపతి, అనంతపురం, కాకినాడ, విజయవాడలో ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.

Latest Updates