8కోట్ల మందికి హెల్మెట్లు లేవు: 60% మందే పెట్టుకుంటున్నరు

స్టడ్స్ యాక్ససరీస్ ఖురానా వెల్లడి
రీప్లేస్‌మెంట్ మార్కెట్ నుంచి డిమాండ్
ముంబై : దేశంలో ఎనిమిది కోట్లమంది టూవీలర్ రైడర్లకు ఇండియాలో ఇంకా హెల్మెట్ కావాల్సి ఉందని లీడింగ్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్ స్టడ్స్ యాక్ససరీస్ లిమిటెడ్ తెలిపింది. దేశంలో టూవీలర్ మార్కెట్‌లో కేవలం 60 శాతం మంది మాత్రమే హెల్మెట్ వాడుతున్నట్టు పేర్కొంది. ‘ఇండియన్ రోడ్లపై 21 కోట్ల మంది ప్రజలు టూవీలర్స్‌‌ను నడుపుతున్నారు. వారిలో 60 శాతం మంది మాత్రమే హెల్మెట్లను పెట్టుకుంటున్నారు. 8 కోట్ల మందికి పైగా టూవీలర్ రైడర్లకు వారి సేఫ్టీ కోసం హెల్మెట్ కావాల్సి ఉంది’ స్టడ్స్ యాక్ససరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ ఖురానా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు బాగా పెరుగుతుండటంతో, టూవీలర్ రైడర్లకు హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గత కొన్నేళ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో హెల్మెట్లకు బాగా డిమాండ్ పెరిగింది. గత పదేళ్ల‌లో ఎన్నడూ లేనంతగా టూవీలర్ మార్కెట్ కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

2009లో 7.43 మిలియన్ యూనిట్ల టూవీలర్లను అమ్మితే.. 2019 నాటికి ఈ అమ్మకాలు 21.18 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఆ తర్వాత ఆటో సెక్టార్ ఎదుర్కొంటోన్న సమస్యలతో 2020లో 17.14 మిలియన్ యూనిట్లే అమ్ముడుపోయాయి. ప్రభుత్వ రెగ్యులేషన్స్ హెల్మెట్‌‌కు ఎప్పుడు డిమాండ్‌‌ను ఉంచుతాయని ఖురానా అన్నారు. ప్రస్తుతం టూవీలర్ హెల్మెట్ మార్కెట్‌లో 30 శాతం మంది తయారీదారులు అనధికారిక మార్కెట్‌లో ఉన్నారని, ఐఎస్‌ఐ మార్క్‌‌లేని యూనిట్లు రోడ్డు ప్రమాదాల సమయంలో అంత సురక్షితం కావని చెప్పారు. కొత్త, పాత బైక్స్, స్కూటర్స్విక్రయాలు మాత్రమే కాక, రీప్లేస్ ‌మెంట్ మార్కెట్ నుంచి కూడా హెల్మెట్లకు డిమాండ్ వస్తున్నట్టు ఇండియాలో అతి పెద్ద టూవీలర్ హెల్మెట్ తయారీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. రెగ్యులర్‌గా వాడే హెల్మెట్ ‌జీవిత కాలం 3 నుంచి 4 ఏళ్ల వరకే ఉంటుందని, ఇది తమకెప్పుడూ అతిపెద్ద మార్కెట్‌గానే ఉంటుందని పేర్కొన్నారు. బైక్ జీవితకాలం పది నుంచి పన్నెండేళ్ల‌ని, ఒక మోటార్‌సైకిల్ రైడర్ సగటున మూడు నుంచి నాలుగు సార్లు హెల్మెట్‌‌ను మార్చాల్సి వస్తుందని ఖురానా చెప్పారు.

40 శాతం మార్కెట్ షేరు పొందుతాం…

హెల్మెట్ మార్కెట్ సైజు ఏడాదికి 2.5 కోట్లుగా ఉందని అన్నారు. దీనిలో స్టడ్స్ యాక్ససరీస్ షేరు 30 శాతంగా తెలిపారు. వచ్చే కొన్నేళ్ల‌లో దీనిని 40 శాతానికి పెంచుతామని చెప్పారు. హెల్మెట్లకు పెరుగుతున్న డిమాండ్‌తో, తాము ప్రొడక్షన్ కెపాసిటీని మరింత పెంచేందుకు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. ఫరీదాబాద్‌లో రూ.200 కోట్ల పెట్టుబడితో కొత్తగా రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు ఖురానా చెప్పారు.

దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తాం
..
వచ్చే మార్చి నాటికితాము దిగుమతిచేసుకునే పార్ట్‌‌ల‌న్ని లోకలైజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు హీరో, బజాజ్ మేనేజ్‌మెంట్లు చెప్పాయి. వచ్చేఏడాది కల్లాచైనీస్ దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తామని సప్లయర్స్ చెబుతున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ, చైనీస్ లింక్‌లను తొలగిస్తామని పేర్కొన్నాయి. ఆటో కంపెనీలకు సప్లై–చెయిన్ నెట్‌వర్క్ ఎంతో ముఖ్యమైనది. ఇతర దేశాల్లోదుకాణాలు తెరుచుకోవాలని సప్లయిర్స్‌‌ను ఆదేశిస్తున్నట్టు హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. కాన్ఫరెన్స్ కాల్‌లో అనలిస్ట్‌‌లకు గుప్తా చెప్పారు. తాము దిగుమతి చేసుకునే చాలా పార్ట్‌‌లర్‌‌ ను లోకలైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తామని టీవీఎస్ మోటార్ ప్రతినిధి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates