అదో రెడ్ లేక్.. షూటింగ్ స్పాట్ లో 8 శవాలు

అదొక ఎర్ర నీటి సరస్సు.. చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చూడటానికి ఎంతో అందంగా ఉందాలొకేషన్. అయితే అదొక యాసిడ్ సరస్సు. అందులో విషరసాయనాలు కలవడం వల్ల అది ఎర్రగా మారింది. ఈ ప్రదేశం సిప్రన్  దేశంలోనిది.  న్యూయార్క్ కు చెందిన ప్రముఖ వీడియో బ్లాగర్ ‘సారాహ్ ఫంక్’ అనే అమ్మాయి.. ఆ సరస్సును వీడియో షూట్ చేసి అక్కడి విశేషాలను తన చానల్ లో పెట్టకోడానికి టీంతో వెళ్లింది.

షూటింగ్ జరుగుతుండగా….  ఓ సూట్ కేసు సరస్సునుండి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. షూటింగ్ యూనిట్ ఆ సూట్ కేసును తెరిచి చూడగా.. అందులో కుళ్లిపోయిన మనిషి శరీరం కనిపించింది. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ బాడీని స్వాధీనం చేసుకుని చుట్టుపక్కల గాలించారు. వారికి మరో ఏడు మృతదేహాలు ఆ సరస్సులో లభించాయి. ఈ హత్యలను చేసినతను ఒకరే అని నిర్ణయించుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. గ్రీక్ ఆర్మీ ఆఫీసర్ నికోస్ మెటాక్సస్‌ అనే అతను.. ఆ హత్యలను చేసినట్టుగా కనుగొన్నారు. దీంతో మెటాక్సస్‌ ను అరెస్ట్ చేసి  విచారించగా ఆ ఎనిమిది హత్యలను తానే చేశానని ఒప్పుకున్నాడు.

సైప్రస్ కు వచ్చిన మహిళా టూరిస్టులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశానని తెలిపాడు. ఆతర్వాత.. వారిని చంపి ఆ రెడ్ లేక్ లో పడేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ సరస్సు యాసిడ్ తో నిండి ఉండటం వల్ల శవాలను గుర్తించడం ఈజీ కాదని అందుకే రెడ్ లేక్ లో పడేసినట్లు నికోస్ మెటాక్సస్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

Latest Updates