ప్రభుత్వం నిర్లక్ష్యంతో 8 జిల్లాల్లో నిలిచిన చేప పిల్లల పంపిణీ

ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య తలెత్తిన వివాదంతో 8 జిల్లాల్లో చేపల పిల్లల పంపిణీ నిలిచిపోయింది. దీంతో చేపల పెంపకంతోనే జీవించే మత్య్సకారుల ఆశలు నెరవేరడం లేదు. పంపిణీ నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్టు వాపోతున్నారు మత్స్యకారులు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్నారు సహకార సంఘం నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 728 మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 63 వేల 335 మంది సభ్యులు ఉన్నారు. వరంగల్ జిల్లాలోని 3వేల890 చెరువులతో పాటు 19 జలాశయాల్లో 14కోట్ల 39 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలాల్సి ఉంది. ప్రభుత్వం,కాంట్రాక్టర్ మద్య తెలెత్తిన వివాదంతో చేపల పిల్లల పంపణీ నిలిచి పోయింది.

ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవటంతో 8 జిల్లాలోని వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ సజావుగా జరుగుతుందని అనుకున్నారు. ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లాలో మైలారం,మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చేప పిల్లలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎర్రెబెల్లి దయాకర్ రావు చెరువులో వదిలారు. అలా వదలిన వెంటనే అవి చనిపోయాయి. అయినా చేపల పిల్లల పంపిణీ సాగుతుందని మత్స్యకారులు భావించారు. కాంట్రాక్టర్ తనకు ఇవ్వకుండా వేరొకరితో చేప పిల్లల పంపిణీ చేయిస్తున్నారంటూ కోర్టుని ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

చేప పిల్లల పంపిణీ జూలై నెలలో జరిగితే ఎదుగుదల ఉంటుందంటున్నారు మత్స్యకారులు. ఇప్పుడు పంపిణీ నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్టు వాపోతున్నారు. సమయానికి చేపల్ని చెరువులో వదలేదంటున్నారు మత్స్యకారులు. గడువుదాటిక వదిలితే…వాటి ఎదుగుదల ఆశించినంతగా ఉండదని చెబుతున్నారు. మత్య్సకారులు నష్ట పోకుండా  ప్రభుత్వం  ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్నారు సహకార సంఘం నేతలు.

Latest Updates