ఫోని తుఫాను: సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది

ఫోని తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇందులో భాగంగా ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మందిని షాలిమార్‌ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లలో తరలించాలని అధికారులు నిర్ణయించారు. మే 3వ తేదీన ఈ తుఫాను కారణంగా గంటకు 200 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికల దృష్ట్యా పూరి, చాంద్‌ బలి, గోపాల్‌ పూర్‌ ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. తుఫాను తీవ్రత గంజాం, గజపతి, పూరి, కేంద్రపద, భాద్రక్‌, జైపూర్‌, బాలాసోర్‌ జిల్లాల్లో అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు చేసిన హెచ్చరికలతో ప్రజలను తరలిస్తున్నారు.ఫోని విపత్తుతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఏపిలోని మూడు జిల్లాలలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తుఫాను బాధితుల కోసం 879 సహాయపునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Latest Updates