రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందిన ఘటన చత్తీస్‌ఘడ్‌లో జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణిస్తున్నకారు లోయలో పడింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడినట్లు సమాచారం. ఈ ఘటన కొండగాన్ జిల్లాలోని మొహబత్తా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాద వార్త తెలియగానే స్పందించిన జిల్లా కలెక్టర్ శిఖర్ రాజ్‌పుత్.. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. శుక్రవారం చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించి వారి బంధువులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. చనిపోయిన వారి కుటుంబానికి తక్షణ సాయం కింద 25,000 వేల రూపాయలను కలెక్టర్ ప్రకటించారు. ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులతో పాటు ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. మరణించిన వారి మృత దేహాలను అతి కష్టం మీద లోయలోనుంచి బయటకు తీశామని ఎస్పీ తెలిపారు.

Latest Updates