ఆటలో గొడవ.. 8 మంది ఖైదీలు మృతి

జైలులో ఖైదీలు సరదాగా ఆడిన ఆటలో గొడవ జరిగి 8 మంది ఖైదీలు చనిపోయారు. ఈ ఘటన మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జాలిస్కో జైలులో జరిగింది. ఖైదీలు ఆడిన ఆటలో గొడవ జరిగి రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో కొంతమంది తుపాకీలు కూడా ఉపయోగించారు. దాంతో ముగ్గురు ఖైదీలు తూటాలకు బలయ్యారు. మరో ఐదుగురు ఘర్షణలో గాయాలై మరణించారు.

ప్యూంటె గ్రాండే కాంప్లెక్స్‌లోని జైలులో జరిగిన ఈ సంఘటనలో.. ముగ్గురు వ్యక్తులు తూటాలకు.. మరో ఐదుగురు గాయాలతో మరణించారని జాలిస్కో ప్రాసిక్యూటర్ గెరార్డో ఆక్టావియో సోలిస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మరో తొమ్మిది మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారని ఆయన తెలిపారు. ఖైదీల ఆటలో గొడవ జరగడంతో ఈ ఘర్షణ జరిగినట్లు ఆయన తెలిపారు.

జైలు సిబ్బంది ఖైదీలపై నియంత్రణ కోల్పోలేదని అధికారులు తెలిపారు. ఖైదీల నుంచి రెండు తుపాకీలను మరియు పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ గొడవకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవతో జైలు అధికారులకు ఏమైనా సంబంధముందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.

For More News..

10 వేల మందిపై వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

నలుగురు యువకులు.. ఓ బాలికను..

Latest Updates