వాయుసేనలోకి 8 ఆధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు

భారత వాయుసేనలో 8 ఆధునిక అపాచీ ఏహెచ్‌-64 యుద్ధ హెలికాప్టర్లు చేరాయి. ఇప్పటికే 4 హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ భారత్‌కు అందించింది. ఇవాళ(మంగళవారం) మరో 8 అపాచీ యుద్ధ హెలికాప్టర్లను బోయింగ్‌ సంస్థ భారత్‌కు అందించింది.

పంజాబ్‌ పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరం నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లు గాల్లోకి ఎగిరాయి. అంతకంటే ముందు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా, వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌ నంబియార్‌తో పాటు పలువురు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అపాచీ యుద్ధ విమానాలు.. వాటర్‌ కెనాన్‌ వందనాన్ని స్వీకరించాయి.

22 అపాచీ చాపర్ల కొనుగోలుకు భారత వాయుసేన 2015 సెప్టెంబర్‌లో అగ్రిమెంట్ చేసుకుంది. 2020 నాటికి మొత్తం 22 హెలికాప్టర్లు భారత్‌కు చేరనున్నాయి. బోయింగ్‌ సంస్థ ఇప్పటి వరకు 2,200 అపాచీ హెలికాప్టర్లను వేర్వేరు దేశాలకు అందించింది.

Latest Updates