80 రంగులు.. బంగారు అంచులు! రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ

ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శు ల నియామకం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు , క్రిస్మస్‌ గిఫ్ట్ ప్యాక్‌‌‌‌ల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనేలా చూడాలని, పంపిణీకి ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్‌ సూచించారు.

57 ఏళ్లు నిండిన వారికి ఆసరా ఫించన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలులో భాగంగా అర్హుల ఎంపికకు ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాలవారీగా లబ్ధిదారుల సంఖ్యను తేల్చాలని, సీఎం కేసీఆర్‌‌‌‌ ఆమోదం తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పారు. 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి జిల్లాలవారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల హాల్‌ టికెట్ల నంబర్లను స్థానిక పత్రికల్లో ప్రచురించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ కోరారు. జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు.

ఐదారు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలి

బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ సూచించారు. పంపిణీ తేదీలను పత్రికల ద్వారా ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. దాదాపు 90 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జౌళి, చేనేత శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ కలెక్టర్లను కోరారు. జిల్లాల్లో దాదాపు వెయ్యి దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మంజూరు అధికారాన్ని శాసన సభ సభ్యులకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా 18న గిఫ్ట్ ప్యాక్‌‌‌‌లు, 20న ఫుడ్ మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మైనారీటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మహేశ్‌ దత్ ఎక్కా సూచించారు.

80 రంగులు… రెండు కొలతలు.. పసిడి అంచులు…

బతుకమ్మ పండుగ ఇప్పటికే పూర్తైనా.. మరోసారి రాష్ట్రంలో బతుకమ్మ సందడి కనిపించబోతోంది. వయసుల వారీగా రెండురకాల చీరలను సిద్ధం చేశారు అధికారులు. రెండు రకాల బంగారు రంగు అంచులు.. 80 రకాల రంగులతో చీరలు తయారు చేయించారు. పొడవాటి చీరలను కట్టుకోవడం పాతతరం మహిళలకు ఇష్టం. అందుకే… చీరలను 5.5 మీటర్లు, 8.20 మీటర్లు.. ఇలా రెండు కొలతల్లో సిద్ధం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రకు దగ్గర్లోని మండలాలు, గ్రామాల్లోని మహిళలకు 8.20 మీటర్ల చీరలను ఎక్కువగా కేటాయించారు. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకే ఈ ఆర్డర్ ఇచ్చారు. పంపిణీలో షార్టేజీ సమస్యలేకుండా.. పూర్తి లక్ష్యానికి ఐదు శాతం ఎక్కువ చీరలను ఉత్పత్తి చేయించారు అధికారులు.

మొత్తం 96 లక్షల చీరలను.. 25వేల మరమగ్గాలపై నేయించారు. 25 వేల కార్మికులకు ఉపాధి కల్పించారు. మొత్తం రూ.280కోట్ల బడ్జెట్ తో బతుకమ్మ చీరలు తయారుచేయించారు.

డ్రాఫ్ట్‌‌‌‌ లిస్టులను వెల్లడించాలి

ఓటరు జాబితాలో 57 నుండి 64 ఏళ్లు ఉన్న వారి వివరాలు తీసుకు ని ఎస్‌ కేఎఫ్‌‌‌‌ డాటాలో సరిచేసుకుని 3,4 రోజుల్లోగా పెన్షన్‌ అర్హుల డ్రాఫ్ట్ లిస్టును గ్రామ సభల్లో వెల్లడించాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ చెప్పారు.  గ్రామాల్లో లక్షా యాబై వేలు, పట్టణాల్లో రెండు లక్షల అదాయ పరిమితి ఉండాలన్నారు. 3 ఎకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట భూములు ఉన్నవారు అర్హులన్నారు. అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ సభలో పెట్టాలన్నా రు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జాబితాను జిల్లా కలెక్టరు ఆమోదించి ప్రభుత్వానికి సమర్పించాలన్నా రు. ఈ నెల 25లోగా జూనియర్‌‌‌‌ పంచాయతీ కార్యదర్శు ల నియామక పత్రాలు జారీ చేసేలా కలెక్టర్లు పని చేయాలన్నా రు. 27న సీఎం కేసీఆర్‌‌‌‌ నిర్వహించే కాన్ క్లేవ్‌ లో గ్రామ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొనాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates